
ఈకధను పూర్తిగా విన్న బాలయ్య ఈ ప్రాజెక్ట్ విషయమై ఆలోచించి చెపుతాను అని చెప్పినట్లు టాక్. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్న బాలయ్య ఈమూవీ తరువాత గోపీచంద్ మలినేనీ దర్శకత్వంలో ఒక మూవీ చేసే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈప్రాజెక్టు సెట్ కాకపోతే హరీష్ శంకర్ వైపు అడుగులు వేయాలని బాలయ్య ఆలోచన అని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వెంకటేష్ లేటెస్ట్ మూవీ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా ఏమిటి అన్న ఆశక్తి అందరిలోను ఉంది. ఈమూవీ తరువాత వెంకటేష్ మార్కెట్ పూర్తిగా పెరిగిపోయింది. లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం వెంకటేష్ 77వ మూవీ డైరెక్టర్ ని దాదాపుగా లాక్ చేసుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
‘సామాజవరగమన’ రచయితలలో ఒకరైన నందు అయిదారు నెలల క్రితమే వెంకటేష్ కు ఒక కథ చెప్పినట్లు ఆకధ వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబుకి కూడా బాగా నచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ కధలో హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి ట్విస్టింగ్ పాయింట్ ఉందని టాక్. ఈకధను హరీష్ శంకర్ బాగా డీల్ చేస్తాడు అని వెంకటేష్ భావిస్తూ ఉండటంతో త్వరలో వీరిద్దరి కాంబినేషన్ పట్టాలు ఎక్కడం ఖాయం అని అంటున్నారు. ‘మిస్టర్ బచ్చన్ ఫెయిలైనా హరీష్ శంకర్ పై నమ్మకంతో వెంకీ ఈనిర్ణయం తీసుకున్నాడు అని అంటున్నారు..