త్రివిక్రమ్ శ్రీనివాసరావు ..ఇలా కన్నా కూడా మాటల మాంత్రికుడు ..గురూజీ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. గురూజీ అని ఎందుకంటారు అంటే ఆయన లైఫ్ మొత్తం చదివేసిన వ్యక్తిలా లైఫ్ కి సంబంధించిన కోటేషన్స్ లైఫ్ కి సంబంధించిన డైలాగ్స్ ఎక్కువగా సినిమాలో వాడుతూ ఉంటారు . ఆయన రాసే డైలాగ్స్ ఆయన తప్పితే వేరే ఎవరు రాయలేరు . మన నిజజీవితంలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా చాలా హుందాగా రియలిస్టిక్ గా ఆ డైలాగ్స్ రాస్తూ ఉంటారు . అందుకే కొంతమంది మాటలు మాంత్రికుడు అని మరి కొంతమంది గురూజీ అని పిలుస్తూ ఉంటారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క స్టార్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ని గురూజీ అంటూ పిలుస్తూ ఉంటారు . 


పలు ఈవెంట్స్ లలో ఆ విషయం బయటపడింది . అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఒక రచయితగా ఒక డైరెక్టర్ గా ఎన్నో ఎన్నో సినిమాలకు వర్క్ చేశారు . అయితే ఆయన ఫేవరెట్ మూవీ ఆయన ఎక్కువసార్లు చూసిన మూవీ ఏంటి అంటే మాత్రం "నువ్వే నువ్వే" అని చెప్పుకొస్తారు. ఆయన కెరియర్ లోనే ఇది ఒక స్పెషల్ మూవీ . ఆయన దర్శకుడిగా తెరంగేట్రం చేసిన మూవీ ఇదే. "నువ్వే నువ్వే" సినిమా ఎంత బాగుంటుందో..? ఎంత మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిందో మనకు తెలిసిందే.



సినిమా ఇప్పటికీ చూసిన బోర్ కొట్టదు . జనాలు టీవీలలో ఇప్పటికీ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు . ఈ సినిమాలోనే ప్రతి డైలాగ్ ఒక అబ్బాయి లైఫ్లో ఒక అమ్మాయి లైఫ్లో ఒక తండ్రి లైఫ్ లో తగిలే ఉంటుంది . అలాంటి రియలిస్టిక్  గా డైలాగ్స్ రాశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఇక డైరెక్షన్ గురించి అయితే మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఇలాంటి సినిమాకి సీక్వెల్ రావాలి అన్న సీక్వెల్ వస్తే హిట్ అవ్వాలి అన్న అది త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారే తెరకెక్కించాల్సిందే . ఇప్పటికీ ఈ సినిమా పాటలను మనం మొబైల్ లో లేదా టీవీలో చూస్తూ వింటూ ఎంజాయ్ చేస్తూనే ఉంటాము..!

మరింత సమాచారం తెలుసుకోండి: