సాధారణంగా మహేష్ బాబుని ఎవరు కూడా పాయింట్ అవుట్ చేయరు.  ఆయనపై నిందలు వేయరు.  ఎందుకంటే అలాంటి కాంట్రవర్షియల్ మ్యాటర్లో అస్సలు ఇరుక్కుకోరు మహేష్ బాబు . ఆ విషయం అందరికీ తెలుసు.  నమ్మకానికి నిజాయితీకి మరో మారుపేరు అంటూ టాలీవుడ్ ఇండస్ట్రిలో ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు . అయితే అలాంటి మహేష్ బాబు ను ఓ  హీరో స్ట్రైట్ గానే తిట్టేశాడు . అలా చేస్తే నీ కెరియర్ సంక నాకి పోతది .. నీ కెరియర్ అసలు ఉండదు అంటూ స్ట్రైట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ ఆయన తండ్రిగారు .


మొదటి నుంచి తండ్రి మాటను జవదాటకుండా వచ్చేవాడు మహేష్ బాబు . ఆ విషయం చాలామందికి తెలుసు. అయితే "మురారి" సినిమా షూటింగ్ టైంలో మహేష్ బాబు ఆరోగ్యం అస్సలు బాగోలేదు . జ్వరం 103 డిగ్రీలు ఉండింది. కానీ మహేష్ బాబు మాత్రం ఎక్కడా బ్రేక్ తీసుకోలేదు. ఎక్కడ బ్రేక్ తీసుకుంటే తన వల్ల సినిమా షూట్ ఇబ్బంది పడిపోతుందో అన్న కారణంగా మహేష్ బాబు జ్వరం ఉన్నా సరే.. షూటింగ్ కి అటెండ్ అయ్యారట.  ఆ టైంలో డాక్టర్స్ కూడా అస్సలు మహేష్ బాబుని షూటింగ్ కి అటెండ్ అవ్వద్దు అంటూ సజెస్ట్ చేశారట . కానీ మహేష్ బాబు మాత్రం అస్సలు వినలేదట .



ఎవరు ఏమనుకున్నా నా ఆరోగ్యం పాడైపోయిన పర్వాలేదు నేను కమిట్ అయిన సినిమాకి పూర్తి న్యాయం చేయాలి అంటూ 103 డిగ్రీలు జ్వరం ఉన్నా సరే మురారి సినిమా షూటింగ్లో పాల్గొన్నారట.  మరి ముఖ్యంగా మురారి సినిమాలోని "డం డం నటరాజు ఆడాలి" సాంగ్ ఆయన ఆరోగ్యం బాగో లేకపోయినా షూట్ చేశారట . అయితే ఆ టైంలో కృష్ణవంశీకి కూడా మహేష్ బాబు తండ్రి కృష్ణ వార్నింగ్ ఇచ్చారట. " నా కొడుకు ఆరోగ్యం పాడైపోతే అస్సలు ఒప్పుకోను..ఊరుకోను" అంటూ బెదిరించారట.  అయినా సరే మహేష్ బాబు కృష్ణవంశీకి సపోర్ట్ చేస్తూ .."మీరు షూట్ కానివ్వండి సార్" అంటూ షూటింగ్ను సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లారట.  సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత పెద్ద హిట్ అయింది ఈ సినిమా అందరికి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ ని ఏ రేంజ్ లో మార్చేసింది అన్న విషయం అందరికీ తెలుసు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: