"అంజి".. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగా ఫ్యాన్స్ కడుపు మండిపోయే మూవీ ఇది . ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి . అందులో ఒకటే అంజి.  నమ్రత శిరోద్కర్  హీరోయిన్గా చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా జనాలను అస్సలు ఆకట్టుకోలేకపోయింది . ఈ సినిమాకి అంత ప్రజాదరణ లభించలేకపోయింది.  ఈ సినిమా ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందో అందరికీ తెలిసిందే.  మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఏదైనా ఫ్లాప్ మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే మొదటగా జనాలు మాట్లాడుకునే మూవీ ఈ అంజీ.


ఈ సినిమాని గంట కూడా చూడలేం రా బాబు అంటూ మెగా ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు . అయితే మొదటగా ఈ మూవీని డైరెక్టర్ కోడి రామకృష్ణ బాలకృష్ణతో తెరకెక్కించాలనుకున్నారట . ఆయనకు కథ కూడా వివరించారట . కానీ నందమూరి బాలకృష్ణ ఆ టైంలో వేరే సినిమా షూట్ లో బిజీగా ఉండడం పైగా ఈ కథ కాన్సెప్ట్ మొత్తం కూడా ఆయనకు ముందుగానే అర్థం అయిపోయిందట.  ఇలాంటి కాన్సెప్ట్ తెలుగు ప్రజలకు పెద్దగా నచ్చకపోవచ్చు అంటూ ముందుగా రిజెక్ట్ చేశారట .



ఆ టైం లో బాలయ్య ఈ మూవీని రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు అంటూ పొగిడేశారు జనాలు. ఆరోజు ఆ సినిమాని మిస్ చేసుకుని మిగతా సినిమాలను ఓకే చేసి ఆయన చేసిన సినిమాలు హిట్ అవ్వగా.. అంజీ సినిమా ఫ్లాప్ అయింది . ఇప్పటికీ ఇది మెగా ఫ్యాన్స్ కి ఓ తీరని లోటుగా మిగిలిపోయింది. అందుకే ఈ సినిమా వదులుకుంది బాలయ్య మంచి పని చేశాడు అంటూ జనాలు పొగిడేశారు. మొత్తానికి అంజీ సినిమా చిరంజీవి కెరియర్ ని నెగిటివ్ గా ట్రోల్ చేసేలా అయిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: