హీరో విక్రమ్, ఎస్ జె సూర్య, దుషారా విజయన్, పృథ్వీరాజ్ తదితర నటీనటులు కాంబినేషన్లు వచ్చిన చిత్రం వీర ధీర శూర. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎస్ యు అరుణ్ కుమార్ తెరకెక్కించగా నిన్నటి రోజున ప్రేక్షకుల  ముందుకు రావడం జరిగింది.. తంగలాన్  సినిమా తర్వాత విక్రమ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా కావడంతో పాటుగా ఈ సినిమా రెండో భాగాన్ని ముందుగా విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యింది. మరి ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిచ్చిందో లేదో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


స్టోరీ విషయానికి వస్తే..
కాళీ (విక్రమ్) ఒక కిరాణా కొట్టును నడుపుతూ తన భార్య వాణి (దుషారా విజయన్) పిల్లలతో ఒక ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ కాళీ గతంలో మరొక కథ ఉంటుంది.. అదే ఊరిలో బాగా పలుకుబడి ఉన్నటువంటి రవి (పృధ్విరాజ్) ఒక పెద్ద మనిషికి నమ్మకమైన అనుచరుడుగా ఉంటారు.అలా ఎన్నో గొడవలలో తల దూర్చిన చరిత్ర కలిగి ఉంటుంది.. అయితే ఆ జీవితం నుంచి పూర్తిగా కుటుంబ జీవితానికి మళ్ళిన తర్వాత రవి.. కాళి ఇంటికి వచ్చి మరి ఒక సహాయాన్ని కోరుతారు.. తన కొడుకుని చంపాలన్న ఎస్పీ అరుణగిరి (ఎస్ జె సూర్య ని) అంతం చేయాలంటూ సహాయం కోరగా అందుకు కాళీ ఒప్పుకోవలసిన పరిస్థితులు ఏమిటి? మరి ఎస్పీకి, రవికి మధ్య విభేదాలు ఏంటి? కాళీ ప్రమేయం ఏ మేరకు ఉందనేది ఈ సినిమా కథ.




సాధారణంగా మొదటి భాగాన్ని విడుదల చేసి రెండవ భాగాన్ని విడుదల చేస్తూ ఉంటారు.. కానీ వీరా ధీర శూర సినిమాకి మాత్రం రెండో భాగాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా మొత్తం ఒక్కరోజు రాత్రి జరిగే కథగా తెరకెక్కించారు. ఇందులో ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ పరిచేలా ఉన్నాయని ప్రేక్షకులు కళ్ళు తిప్పుకోనీయకుండా చేస్తాయని నేటిజన్స్ తెలుపుతున్నారు. వీరా ధీర శూర సినిమాలో చాలా ట్విస్టులు కలిగే ఉన్నాయట.


ప్లస్:
విక్రమ్ యాక్టింగ్, యాక్షన్స్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, సెకండాఫ్ లో వచ్చే డ్రామా సన్నివేశాలు.


మైనస్:
ఆసక్తి గా కనిపించని కథనం..


చివరిగా విక్రమ్ వీరా ధీర శూర సినిమా ఒక యాక్షన్ సినిమాగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: