
స్టోరీ విషయానికి వస్తే:
కాలేజీ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా.. అయితే చదువు పూర్తి అయ్యి ఆ తర్వాత ఒకచోట కలిస్తే వారు చేసే అల్లరి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తీసుకోవచ్చారు..ఇందులో లడ్డు గాని పెళ్లిలో అందరూ కలుస్తారు.. ఆ తర్వాత లడ్డు గాని ఎలా జరిగింది?.. పెళ్లి చేసుకున్న తరువాత హనీమూన్ కి లడ్డు ఎక్కడికి వెళ్లారు.. వాడి లైఫ్ తో మ్యాడ్ గ్యాంగ్ ఎలా ఆడుకున్నది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించగా నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ వంటి వారు నటించారు.
మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ప్రతి సీన్లు ఏదో ఒక కామెడీ ని పెట్టి చూపించే ప్రయత్నం చేశారని.. కొంతమేరకు కామెడీ ఓకే అనిపించిన ప్రతి సన్నివేశంలో కూడా అవి ఉంటే అవి జబర్దస్త్ కంటే మరింత దారుణంగా మారిందని నేటిజన్స్ తెలుపుతున్నారు. కొన్ని కామెడీ సీన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ రొటీన్ కామెడీ వల్ల , అలాగే ఈ సినిమాని సాగదీయడం వల్ల కొంతమేరకు ప్రేక్షకులు నిరాశ చెందారనే విధంగా తెలుపుతున్నారు.మ్యాడ్ సినిమా మంచి విజయానికి అందుకోవడానికి కారణం అప్పటివరకు అలాంటి కాన్సెప్ట్ తో ఏ సినిమా రాలేదు కాబట్టి వర్కౌట్ అయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి కామెడీ తోనే వస్తే అంతగా సక్సెస్ కావకపోవచ్చు అని నెటిజెన్స్ తెలుపుతున్నారు.
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్లు బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని.. కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉన్నదంటూ తెలుపుతున్నారు. వీరి ముగ్గురు కలిసి ఒకే చోట ఉంటే కచ్చితంగా అప్పుడు ప్రతి సీను కూడా ప్రేక్షకులను నవ్వించేలా ఉందని తెలుపుతున్నారు. వీర్ ప్రతి పాత్ర కూడా న్యాయం చేశారని తెలుపుతున్నారు. మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదని ఓవరాల్ గా ఈ సినిమా యావరేజ్ గా ఉన్నదట. యూత్ కైతే బాగా కనెక్ట్ అవుతుందని తెలుపుతున్నారు. మరి పూర్తి రివ్యూ తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
సినిమా ప్లస్ పాయింట్:
ఫస్టాఫ్, సంగీత్ శోభన్ టైమింగ్
సినిమా మైనస్:
రొటీన్ కథ, అక్కడక్కడ సాగదీత, ఓవర్ కామెడీ.