నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కి ఐదేళ్ల క్రితం విడుదలైన భీష్మ మూవీ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత నితిన్ నటించిన రంగ్ దే మినహా మరే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. రాబిన్ హుడ్ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించడం నితిన్, శ్రీలీల, వెంకీ కుడుములకు కీలకం కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుందో చూద్దాం.
 
కథ :
 
సాధారణ వ్యక్తిగా జీవితం సాగిస్తూనే దొంగగా మారి ఒక మిషన్ కోసం రామ్ (నితిన్) కష్టపడుతూ ఉంటాడు. అయితే ఊహించని కారన్దాల వల్ల రామ్ నీరా వాసుదేవ్( శ్రీలీల) కు సెక్యురిటీ కల్పించాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో రామ్ కు ఎదురయ్యే సమస్యలు ఏమిటి? ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా
 
విశ్లేషణ :
 
ఛలో, భీష్మ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించారు. సినిమాలో కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. నితిన్, శ్రీలీల తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కొంతమేర నిరాశపరిచింది.
 
దేవిడ్ వార్నర్ సన్నివేశాలు బాగానే ఉన్నా ఈ పాత్రకు ఆ స్థాయి క్రికెటర్ అవసరం లేదని చెప్పవచ్చు. సినిమాలో ఎమోషన్స్ కు సైతం దర్శకుడు ప్రాధాన్యత ఇచ్చారు. అది దా సర్ప్రైజ్ సాంగ్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ లా ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
 
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలలో అది దా సర్ప్రైజ్, వన్ మోర్ టైమ్ పాటలు మెప్పించాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇతర టెక్నికల్ విభాగాలు సైతం తమ పరిధి మేర మెప్పించడం గమనార్హం.
 
బలాలు : నితిన్ యాక్టింగ్, వెంకీ డైరెక్షన్, కామెడీ
 
బలహీనతలు : సెకండాఫ్ లోని కొన్ని సీన్స్, పేలని కొన్ని పంచ్ డైలాగ్స్, స్టోరీ లైన్
 
రేటింగ్ : 3.0/5.0
 


మరింత సమాచారం తెలుసుకోండి: