లవ్,డేటింగ్ ఎఫైర్ల విషయంలో శృతిహాసన్ ఎప్పుడు కోలీవుడ్,టాలీవుడ్ లో హాట్ టాపిక్ గానే ఉంటుంది.ఈమె పేరు ఎప్పుడూ ఏదో ఒక నటుడితో లేక డైరెక్టర్ తో వినిపిస్తూనే ఉంటుంది. అలా తండ్రికి తగ్గ తనయురాలుగా నటనలోనే కాదు డేటింగ్ విషయంలో, ప్రేమ విషయంలో కూడా అచ్చం కమల్ హాసన్ లాగే శృతిహాసన్ తయారయ్యిందని చాలామంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే శృతిహాసన్ ఇప్పటికే ఎంతోమంది తో డేట్ చేసింది అఫీషియల్ గా బయటపెట్టినవి కొంతమందివి అయితే బయట పెట్టనవి ఎన్నో డేటింగ్ రూమర్లు శృతిహాసన్ మీద ఉన్నాయి. అయితే అలాంటి శృతిహాసన్ తాజాగా ఆ డైరెక్టర్ తో మళ్ళీ ప్రేమలో పడిపోయింది అంటూ కోలీవుడ్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది. ఇక శృతిహాసన్ గత ఏడాది శాంతాను హజరికతో బ్రేకప్ చెప్పుకొని మళ్లీ సింగిల్ లైఫ్ ని కొనసాగిస్తుంది. 

డూడుల్ ఆర్టిస్టు అయినటువంటి శాంతాను హజరికతో చాలా రోజులు సహజీవనం చేసిన శృతిహాసన్ పెళ్లికి కూడా సిద్ధమైంది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా వీరిద్దరి మధ్య బ్రేకప్ వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే శృతిహాసన్ శాంతాను హాజరికా ఇద్దరు పలు ఇంటర్వ్యూలలో బ్రేకప్ న్యూస్ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా శృతిహాసన్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రజినీకాంత్ హీరోగా చేసిన కూలి మూవీలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలోని ముచ్చట్లు శృతిహాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. రజినీకాంత్ యాక్టింగ్ కి నేను ఫిదా అయిపోయాను.పర్సనల్గా ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటూ రజినీకాంత్ ని పొగిడింది.

అలాగే మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అని ప్రశ్న ఎదురవగా..నాకు లోకేష్ కనగరాజ్ అంటే ఇష్టం అని అందరిలో కొత్త అనుమానాలు పుట్టించింది శృతిహాసన్.ఇక ఈ అనుమానాలు ఎందుకంటే శృతిహాసన్ శాంతాను హాజరికతో బ్రేకప్ చెప్పుకున్న సమయంలో లోకేష్ కనగరాజ్ తో డేటింగ్ వల్లే శాంతాను కి బ్రేకప్ చెప్పిందనే రూమర్స్ వినిపించాయి.ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ శృతిహాసన్ ఇద్దరు కలిసి ఇనిమోల్ అనే మ్యూజిక్ వీడియో లో చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మ్యూజిక్ వీడియోలో లోకేష్ శృతిహాసన్ చాలా బోల్డ్ గా చేశారు. దీనివల్లే శృతిహాసన్ శాంతాను కి  దూరమైంది అనే రూమర్లు వినిపించాయి. అయితే ఈ రూమర్లు వినిపిస్తున్న వేళ శృతిహాసన్ నాకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అంటే ఇష్టం అని చెప్పడంతో శృతిహాసన్ మళ్లీ లోకేష్ కనగరాజ్ ప్రేమలో పడిపోయింది అనే రూమర్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: