ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప" మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా అల్లు అర్జున్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అల్లు అర్జున్ నెక్స్ట్ ఎలాంటి మూవీ లు చేస్తాడు ... ఎవరితో సినిమాలు చేస్తాడు ... అనే ఆసక్తి జనాల్లో బాగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని తమిళ దర్శకుడు అయినటువంటి అట్లీ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం. అలాగే ఆ తర్వాత మూవీ ని అల్లు అర్జున్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ చెప్పుకొచ్చాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన ఫోటో షూట్ మే లేదా జూన్ నెలలో జరుగుతుంది అని చెప్పాడు.

అలాగే ఆ మూవీ కి సంబంధించిన ఫోటో షూట్ కంప్లీట్ అయిన తర్వాత చాలా తక్కువ రోజుల్లోనే ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ను కూడా మొదలు పెట్టబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ఇక అల్లు అర్జున్ , త్రివిక్రమ్ ఇద్దరితో సమాంతరంగా సినిమాలు చేయబోతున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఇలా నాగ వంశీ తాజా ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్ నెక్స్ట్ రెండు మూవీ లకు సంబంధించిన క్రేజీ వివరాలను చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa