మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఎం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. అలాగే ఈ మూవీ లో సమంత తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈమెకు ఈ సినిమా తర్వాత వరస పెట్టి తెలుగులో అవకాశాలు వచ్చాయి.

అలాగే ఈమె నటించిన సినిమాలు తెలుగులో చాలానే మంచి విజయాలు సాధించడంతో అత్యంత తక్కువ సమయం లోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న తర్వాత ఈమె కెరియర్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని స్థితిలో తన కెరియర్ను ముందుకు సాగించింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ కి అద్భుతమైన గుర్తింపు తెలుగు  సినీ పరిశ్రమలో ఉంది. కానీ ఈమె మాత్రం ప్రస్తుతం యాక్టివ్ గా సినిమాలు చేయడం లేదు. ఆఖరుగా ఈమె తెలుగులో ఖుషి అనే మూవీ లో నటించింది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈమె తన తదుపరి మూవీ ని ఇప్పటి వరకు ఓకే చేయలేదు.

ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఎన్నో సందర్భాలలో తన అందాలను అరబోసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా సమంత కు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో సమంత అదిరిపోయే హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: