
ముస్లిం మతానికి సంబంధించిన సల్మాన్ ఖాన్ అయినప్పటికీ కూడా రామ మందిరానికి సంబంధించి ఎడిషన్ వాచ్ ని ధరించారు. ఈ ఫోటోలు స్వయంగా సల్మాన్ ఖాన్ షేర్ చేయడం జరిగింది. ఈ వాచీ విలువ సుమారుగా 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఫోటోలు చూసి పలువురు అభిమానులు ఆశ్చర్యపోయి ఈ ఫోటోలను వైరల్ గా చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలకు సల్మాన్ ఖాన్ ఈనెల 30న థియేటర్లో కలుద్దాం అంటూ తమ అభిమానులకు పిలుపునివ్వడం జరిగింది.
సినిమా ప్రమోషన్స్ లో ఒకవైపు బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్ రామ జన్మభూమి ఎడిషన్ వాచ్ ని ధరించడంతో మరింత అట్రాక్షన్ గా నిలబడమే కాకుండా పేరు వైరల్ గా చేసుకుంటున్నారు. ఈ వాచ్ లో శ్రీరాముడు హనుమంతుడు అలాగే అయోధ్య మందిరానికి సంబంధించి డిజైన్ ని పూర్తిగా సృష్టించినట్లుగా కనిపిస్తున్నది.. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం ముస్లిం అయ్యుండి కూడా సల్మాన్ ఖాన్ ఇలాంటివి ఎందుకు ధరిస్తున్నారు అంటూ ఫైర్ అవుతూ ఉన్నారు. మరి సినిమాల కోసమే హిందూ దేవాలయాల ప్రమోషన్స్ ఉపయోగిస్తున్నారా అంటూ మరికొంతమంది కూడా ఫైర్ కావడం జరుగుతుంది. ఏది ఏమైనాప్పటికీ సల్మాన్ ఖాన్ ధరించిన ఈ వాచి మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నది.