టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉంటారు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 2 అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక బాలకృష్ణ ఆఖరుగా డాకు మహారాజ్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈ రెండు సినిమాలు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ప్రస్తుతం అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిపోతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను అందుకున్న టాప్ 10 మూవీలలో ఈ రెండు సినిమాలు స్థానాలను దక్కించుకున్నాయి. మరి ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఎన్ని వ్యూస్ ను దక్కించుకొని టాప్ 10 లో ఏ స్థానంలో నిలిచాయి అనే వివరాలను తెలుసుకుందాం.

పుష్ప పార్ట్ 2 మూవీ కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సంవత్సరం ఈ మూవీ కి నెట్ ఫ్లిక్స్ లో 9.4 మిలియన్ వ్యూస్ దక్కాయి. దానితో ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న ఇండియన్ సినిమాల లిస్టులో ఈ మూవీ రెండవ స్థానంలో కొనసాగుతుంది.

ఇక డాకు మహారాజ్ మూవీ కి ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో 5 మిలియన్ వ్యూస్ దక్కాయి. దానితో ఈ మూవీ ప్రస్తుతం ఈ సంవత్సరంలో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న సినిమాలలో 5 వ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: