ఈ సంవత్సరంలో ఇప్పటివరకు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. అందులో మరికొన్ని సినిమాలు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లు రాబట్టాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టిన టాప్ 5 మూవీస్ ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.

విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి ఈ సంవత్సరం అత్యధిక రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

రామ్ చరణ్ హీరో గా రూపొందిన గేమ్ చేంజర్ , నాగ చైతన్య హీరో గా రూపొందిన తండల్ , ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన కోర్టు మూవీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం అత్యధిక రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ , మూడవ , నాలుగవ స్థానాలలో కొనసాగుతున్నాయి.

బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 8 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం అత్యధిక రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 5 వ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: