తెలుగు సినిమా పరిశ్రమలోకి ఈ మధ్య కాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది మాత్రమే అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అవుతున్నారు. ఇకపోతే కొంత మంది అద్భుతమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకొని మంచి విజయాలను అందుకున్న కూడా వారి కెరియర్ అంతా గొప్పగా ముందుకు సాగడం లేదు. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె ఇప్పటికే తెలుగులో అనేక సినిమాలలో నటించి కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా సొంతం చేసుకుంది.

ఇక ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఓ స్టార్ హీరో సినిమాల్లో రెండు సార్లు హీరోయిన్గా నటించింది. ఇక ఇప్పటికే తెలుగులో ఎంతో గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న ఈమెకు ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. ఇంతకు పైన ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి క్యాథరిన్. ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ హీరోగా రూపొందిన సరైనోడు , ఇద్దరమ్మాయిలతో అనే రెండు సినిమాలలో హీరోయిన్గా నటించింది.

ఇందులో సరైనోడు మూవీ సూపర్ సక్సెస్ కాగా ... ఇద్దరమ్మాయిలతో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ ఆఖరుగా నితిన్ హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతం కూడా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: