ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించి వాటిలో అనేక మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న ఎంతో మంది హీరోలతో సినిమాలను నిర్మించాడు.

కానీ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మాత్రం ఒక సినిమా కూడా చేయలేదు. అలాగే ఆయనతో ఇప్పటి వరకు సినిమాకు కూడా నాగ వంశీ కమిట్ కాలేదు. దానితో తాజాగా నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆయనకు మీరు ఎందుకు రామ్ చరణ్ తో ఇప్పటి వరకు సినిమా చేయలేదు. ఆయనతో సినిమాను చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనే ప్రశ్న ఎదురయింది. దానికి నాగ వంశీ సమాధానం చెబుతూ ... రామ్ చరణ్ తో సినిమాను చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఆయన ఓకే అంటే సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాను అని నాగ వంశీ సమాధానం చెప్పాడు.

దానితో దర్శకుడు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న నాకు వంశీ కి ఎదురయింది. దానితో ఆయన దర్శకుడుది పెద్ద విషయం ఏమీ కాదు. ఆయన డేట్స్ ఇచ్చాడు అంటే మంచి కథను పట్టి , మంచి దర్శకుడిని సెట్ చేస్తాను. ఆయన డేటా ఇవ్వడమే లేట్ అని నాగ వంశీ సమాధానం ఇచ్చాడు. ఇకపోతే తాజాగా నాగ వంశీ "మ్యాడ్ స్క్వేర్" అనే మూవీ ని రూపొందించాడు. ఆ మూవీ ఈ రోజు అనగా మార్చి 28 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: