ఇక మన స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమాతో వస్తేనే అదో గొప్ప అద్భుతం పెద్ద పండగల ఉంటుంది అభిమానులకు .. అయితే అలాంటివారి నుంచి రెండు సినిమాల వస్తే ఇంకేమైనా ఉంటుందా ? అయినా అది మన ఆశ గాని .. అసలు ఇప్పుడున్న పాన్ ఇండియా ప్రపంచం లో ఏడాదికి రెండు సినిమాలు చేయటం సాధ్యమేనా ? సాధ్యమే అంటున్నారు మన స్టార్ హీరోలు .. అది ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం . పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత ఏడాదికి ఒక్క సినిమా కాదు రెండేళ్లకో మూడేళ్లుకో గాని ఒక్కసారి కనిపిస్తున్నారు మన హీరోలు .. ఇలాంటి సమయంలో ఏడాదికి రెండు సినిమాలు ఈజీగా చేస్తున్నారు ప్రభాస్.  


ఆయన ప్లానింగ్ మిగిలిన  హీరోలంతా ఫిదా అవుతున్నారు .. 2024 లోను కల్కి తో వ‌చ్చిన ప్రభాస్‌ 2025 లోను రెండు సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు .  ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ తో బిజీగా ఉన్నాడు .. మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చింది . దీంతో పాటు హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది .. ఇది కూడా 2025 డిసెంబర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు .. ఇలా ఈ రెండు సినిమాలు తక్కువ గ్యాప్ లోనే రాబోతున్నాయి .

 

ఇక ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ గా వచ్చిన బాలయ్య వచ్చే దసరాకు అఖండ 2 తో రాబోతున్నాడు .. గత ఎన్నికల కారణంగా 2024 లో వచ్చిన బాకీని 2025 లో తీర్చబోతున్నాడు బాలయ్య . ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్ని కుదిరితే 2025 లోనే రెండు సినిమాలు తో రావడానికి సిద్ధంగా ఉన్నాడు .  ఇప్పటికే మే 9న హరిహర వీరమల్లు రావడానికి రెడీగా ఉంది .. ఇక ఒజీని కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్ .. ఇక ఇది సెప్టెంబర్ లో వచ్చే అవకాశం లేదు .. ఇది కూడా జరిగితే ఫ్యాన్స్ కు పెద్ద పండుగ . ఇక 2025 మేలో హీట్ 3 తో వస్తున్నాడు నాని .. మళ్లీ 8 నెలలు తిరిగోళ్లప్పే మార్చ్ 26 2026న ది పారడైజ్ తో మరో దండయాత్రకు రెడీ అవుతున్నాడు .. మరో పక్క మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా ఆగస్టు 14న వార్ 2 తో రాబోతున్నాడు .  ఈ సినిమా వచ్చిన నాలుగు నెలల లోనే 2026 సంక్రాంతి ప్రశాంత్ నీల్ సినిమా తో రాబోతున్నాడు . నాగార్జున సైతం 2025లో కుబేర , కూలి సినిమాలతో వస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: