టాలీవుడ్ స్టార్ హీరో నాని నిర్మాతగా కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రోషన్, శ్రీ దేవి ప్రధాన పాత్రలో నటించారు. అలాగే నటుడు ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ సహాయక పాత్రలను పోషించారు. కోర్ట్ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చితే.. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

సినిమా ముఖ్యంగా పోక్సో చట్టం గురించి లోతుగా తెలిజేయడం కోసం తీసింది. కోర్ట్ సినిమాలో ఫస్ట్ ఆఫ్ మొత్తం టీనేజ్ ప్రేమ కథను చూపించారు. సెకండాఫ్ మొత్తం కోర్ట్ సీన్స్ ఉంటాయి. సినిమాలో చందు పాత్రలో రోషన్, జాబిలి పాత్రలో శ్రీదేవి బాగా నటించారు. వీరిద్దరూ ఈ సినిమాలో ప్రేమించుకుంటారు. మంగపతి అనే బలమైన పాత్రలో శివాజీ కనిపించారు. మంగపతి, శ్రీదేవి మేనమామ.. చందుపైన పోక్సో కేసు పెడుతాడు. లాయర్ కి అసిస్టెంట్ గా తేజ అనే పాత్రలో ప్రియదర్శి చందుపైన పెట్టిన తప్పుడు కేసును ఎలా ముగిస్తాడానేదే ఈ సినిమా కథ. సినిమా మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా అలా సాగిపోతూ ఉంటుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసి పోక్సో చట్టం అంటే ఏంటి అనేది తెలుసుకుంటారు. ఈ సినిమాకు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతారు. ఇక కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ సినిమాకు 2.75 రేటింగ్ వచ్చింది.


అయితే కోర్ట్ మూవీలో చందు, జాబిలిది సంబంధించిన ఒక ఇంటరెస్ట్యింగ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో వారిద్దరూ ఒక బొమ్మల పెళ్లి చేసుకుంటారు. ఈ సినిమాలోని ఆ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. కోర్ట్ మూవీలోని ఆ సీన్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దీప్తి సునైనా నటించిన సాంగ్ లోది. ఇందులో వినయ్ షణ్ముఖ్ కూడా నటించాడు. వీరిద్దరూ చేసిన ఏమోనే అనే సాంగ్ లోని పెళ్లి సీన్ ని లేపేసి కోర్ట్ సినిమాలో పెట్టారని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: