మన చిత్ర పరిశ్ర‌మ‌లో ఇప్పటికే ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి .. ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలోనటించి ఫ్యాన్స్ కు భలే ఆనందాన్ని కిక్ ఇచ్చారు .. అలాగే ఒక హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ గా కనిపిస్తే ఇక థియేటర్లు పగిలి పోవాల్సిందే .. ఇక ఇప్పటికే చాలామంది సినిమాల్లో హీరోలు గెస్ట్లుగా నటించి మెప్పించారు .. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , త్రిబుల్ ఆర్ లాంటి మల్టీస్టార‌ర్‌ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు ..


 అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారని విషయం చాలామందికి తెలియదు .. ఈ విషయం చెప్తే చాలామంది షాక్ అవుతారు కానీ ఇది నిజం .. ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్లో కనిపిస్తారు . ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు .  సలార్ సినిమాతో భారీ విజయనందుకున్న ప్రభాస్ తర్వాత కల్కి సినిమాలతో 1000 కోట్ల‌ కలెక్షన్ రాబట్టి కొత్త రికార్డు క్రియేట్ చేశాడు .  ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు .. ఇక ప్రభాస్ చేస్తున్న వ‌రుస‌ సినిమాల్లో సలార్ 2, కల్కి2 ,  రాజా సాబ్ , హను రాఘవపూడి సినిమాలు అలాగే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలు ఉన్నాయి . మరోపక్క ఎన్టీఆర్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ..


త్రిబుల్ ఆర్ తర్వాత దేవ‌ర‌ సినిమా తో హిట్  అందుకున్న‌డు ఎన్టీఆర్ .. అలాగే ఇప్పుడు బాలీవుడ్లో వార్ 2 అలాగే దేవర 2 , ప్రశాంత్ నీల్ సినిమాలను లైన్లో ఉంచాడు .. అయితే ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రూల్ చేశారని చాలామందికి తెలిసి ఉండదు ఆ సినిమా మరేదో కాదు దర్శకద్రుడు రాజమౌళి తెర్కక్కించిన యమదొంగ .. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కూడా కనిపిస్తాడు .  అయితే అది సినిమాలో కాదు టైటిల్ కార్డ్స్ పడే సమయంలో విశ్వామిత్ర ప్రొడక్షన్స్ కోసం టెస్ట్ షూట్లో కనిపించాడు .. కానీ మునివేషం లో ఉన్న ప్రభాస్ ను ఎవరూ కనిపెట్టలేరు అలా తారక్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో నటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: