ఇది నిజంగా నిహారిక కి జాక్ పాట్ ఛాన్స్ అనే చెప్పాలి . సాధారణంగా విడాకులు తీసుకున్నాక అమ్మాయిలకి లైఫ్ ఉండదు అంటుంటారు జనాలు. అయితే నీహారిక కి మాత్రం విడాకులతోనే బాగా కలిసి వస్తుంది. ఇన్నాళ్లు నిహారిక పేరుపై ఎలాంటి ట్రోలింగ్ జరిగింది అనే విషయం అందరికీ తెలుసు . మెగా డాటర్ అంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చిన .. ఆ డాటర్ లైఫ్ లో తీసుకున్న కొన్ని డెసిషన్స్ జనాలకు అదే విధంగా అభిమానులకు అస్సలు నచ్చలేదు.


మరీ ముఖ్యంగా ఆమె విడాకులు తీసుకోవడం మెగా ఫ్యామిలీతో పాటు ఆమె కెరీర్ నీకు కూడా డౌట్ ఫాలో అయ్యేలా చేసింది . అయితే ఇప్పుడిప్పుడే సినిమాలోకి వచ్చి మళ్ళీ తన పేరుకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. అలాంటి నిహారిక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో ఆఫర్ అందుకుంది అంటు వార్తలు వినిపిస్తున్నాయి.  దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమ్రోగిపోతుంది . అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో సినిమా తెరకెక్కబోతున్నట్లు అందరికీ తెలిసిందే .



అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా సమంత అదే విధంగా జాన్వి కపూర్ ని చూస్ చేసుకున్నారు అంటూ టాక్ వినిపించింది . కాగా ఈ సినిమాలో ఒక స్పై ఏజెంట్ రోల్ కోసం నిహారిక పేరుని సజెస్ట్ చేశారట అల్లు అర్జున్ . చాలామంది అనుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీకి అదే విధంగా మెగా ఫ్యామిలీకి అస్సలు కుదరడం లేదు అని.  అందుకే మెగా ఫ్యామిలీ - అల్లు అర్జున్ ని పూర్తిగా దూరం పెట్టేసిందని . ఇలాంటి మూమెంట్ లో అల్లు అర్జున్ స్వయంగా ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం నిహారిక పేరుని సజెస్ట్ చేశారు అన్న వార్త బయటకు రావడం చాలా చాలా వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నిహారిక పేరు మారుమ్రోగిపోతుంది . నక్క తోక తొక్కిందిరో అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: