
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో తరచూ ఎక్కువగా ట్రోలింగ్స్ హీరోలకు చిత్రాలకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి..కొంతమంది కావాలని విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది.. అనుకున్నప్పటికీ కూడా డైరెక్టర్ బుచ్చిబాబుతో తెరకెక్కిస్తున్న సినిమాని మరింత కసిగా ప్లాన్ చేశారు రామ్ చరణ్.. అందుకే నిన్నటి రోజున ఫస్ట్ లుక్ టైటిల్ ని విడుదల చేశారు. ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారని సినిమా షూటింగ్ మొదలు అప్పటి నుంచే వార్తలు వినిపించాయి.
అయితే నిన్నటి రోజున టైటిల్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ కనిపించిన తీరుని చాలామంది అల్లు అర్జున్ పుష్ప , పుష్ప 2 చిత్రాలలో కనిపించిన లుక్ లాగే ఉందంటూ చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంతకుమించి పెద్దగా కొత్తగా ఏమీ రామ్ చరణ్ లుక్ కనిపించలేం లేదంటూ చాలామంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ లుక్ ను రామ్ చరణ్ లుక్ పోలి ఉండడంతో ఇప్పుడు రామ్ చరణ్ కు ఒక కొత్త తలనొప్పి వచ్చింది.. దీంతో అటు రామ్ చరణ్ అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు.