టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ కు గతంలో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వచ్చినా ఈ మధ్య కాలంలో ఆఫర్లు ఆశించిన స్థాయిలో రావడం లేదనే సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ పూరీ జగన్నాథ్ సినిమాకు నో చెప్పాను అంటూ ఒకింత సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
కాలేజ్ లో చదువుకుంటూనే తాను మోడలింగ్ చేశానని ఆమె అన్నారు. ఆ సమయంలో నా ఫోటోలు చూసి కన్నడ ఇండస్ట్రీ నుంచి అవకాశం వచ్చిందని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే అప్పట్లో సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి నాకు పెద్దగా అవగాహన లేదని ఆమె వెల్లడించారు. నేను సౌత్ సినిమాలు కూడా చూడలేదని అందువల్ల ఛాన్స్ వచ్చిన సమయంలో మొదట కొంత సమయం పాటు ఆలోచించానని రకుల్ తెలిపారు.
 
సౌత్ మేకర్స్ నా తండ్రితో మాట్లాడటంతో నేను గిల్లీ సినిమాలో నటించానని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు. గిల్లీ సినిమా షూట్ వల్ల చదువు విషయంలో కొంతమేర ఇబ్బందులను సైతం ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తొలి సినిమాతోనే యాక్టింగ్ ఎంతగానో నచ్చిందని చదువు పూర్తి చేసి సినిమాల్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
తొలి సినిమా రిలీజ్ తర్వాత పూరీ జగన్నాథ్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ఆయన 70 రోజుల డేట్స్ అడిగారని దానికి నేను అంగీకరించలేదని రకుల్ వెల్లడించారు. నా ఇబ్బందిని పూరీ జగన్నాథ్ అర్థం చేసుకున్నారని ఆ సమయంలో నేను ఎన్నో సినిమాలు వదులుకున్నానని రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్లు చేయడం గమనార్హం. రకుల్ ప్రీత్ సింగ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: