- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు నార్నె నితిన్ - సంగీత్ శోభన్ ... అలాగే రామ్ నితిన్ ల కలయికలో ఆల్రెడీ వచ్చిన మ్యాడ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అప్ప‌ట్లో ఈ సినిమా చాలా సైలెంట్ గా వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డం తో పాటు క్రియేట్ చేసిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. మ్యాడ్ లాభాల ప‌రంగా కూడా పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. అంత పెద్ద సూపర్ హిట్ అయ్యిన మ్యాడ్ సినిమా కు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ ని మేకర్స్
ప్ర‌క‌టించారు. మ్యాడ్ సినిమా కు సీక్వెల్ వ‌స్తుంద‌న్న ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇక మ్యాడ్ స్క్వేర్ సినిమా ను ఈ రోజు మేక‌ర్స్ రిలీజ్ కు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా పై గ‌త నెల రోజుల నుంచే మంచి హైప్ నే నెలకొనగా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా సాలిడ్ బుకింగ్స్ ని చూపిస్తూ దూసుకు పోతోంది.


యూఎస్ లో కేవలం ప్రీమియర్స్ తోనే గట్టి వసూళ్లు రాబట్టినట్టుగా అక్క‌డ‌ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. మ్యాడ్ స్క్వేర్ ప్రీమియర్స్ వసూళ్ల తోనే ఏకంగా 3 లక్షల కు పైగా డాలర్ల ను అందుకున్నట్టుగా స‌మాచారం. ఓవ‌రాల్ గా చూస్తే ఈ సినిమా రిలీజ్ కు ముందే మంచి వ‌సూళ్లు అందుకుంది. ఇక సినిమా కు సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ రావ‌డం తో ఏ రేంజ్‌లో వ‌సూళ్లు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. ఇక ఈ రోజు టాలీవుడ్ లో రిలీజ్ అయిన నాలుగు సినిమా ల కంటే కూడా ఈ సినిమా యే తోపు.. బాక్సాఫీస్ ను రూల్ చేస్తుంద‌ని అంటున్నారు. నితిన్ రాబిన్ హుడ్ , లూసీఫ‌ర్ 2 , విక్ర‌మ్ వీర శూర ధీర సినిమా ల కంటే కూడా ఈ సినిమా కే మంచి టాక్ వ‌చ్చింది. ఈ సినిమా కు భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: