
అలాగే లూసీఫర్ అంటే దైవదూతగా అని అర్థమని ఎంపురాన్ అంటే రాజు అర్థం ఉందట..L2 ఎంపురాన్ సినిమా నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా లెవెల్ లో రావడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించింది.అయితే మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయని తెలుస్తోంది.కేవలం ఇండియాలోనే రూ .22 కోట్ల నెట్టు కలెక్షన్స్ ని రాబట్టిందట.. మలయాళ ఇండస్ట్రీలోని ఈ రేంజ్ లో వసూలు అందుకున్న మొట్టమొదటి చిత్రంగా L2 ఎంపురాన్ నిలిచింది..
గతంలో ది గోట్ లైఫ్ పృధ్వీరాజ్ సుకుమారం హీరోగా నటించిన చిత్రం ఉన్నప్పటికీ.. ఈ చిత్రం దేశంలోని 8.95 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇతర దేశాలలో కూడా L2 ఎంపురాన్ చిత్రం అదరగొడుతున్నట్లు తెలుస్తోంది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రాంతాలలో కూడా భారీగానే ఓపెనింగ్స్ రాబడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2019 వరకు మలయాళ ఇండస్ట్రీలో 100 కోట్లు రాబట్టిన చిత్రాలు లేవట లూసిఫర్ సినిమా మొదటిసారి 100 కోట్ల క్లబ్బులో చేరి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మంజుమల్ బాయ్స్ సుమారుగా 200 కోట్ల రూపాయలను రాబట్టిందట. మరి L2 ఎంపురాన్ సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి మరి. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి రికార్డుల విషయంలో చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.