
చిన్న హీరోలు మీడియం రేంజ్ హీరోలు సైతం పబ్లిసిటీ చేసుకోవడానికి రావడానికి బద్దకంగా ఫీల్ అవుతున్నారు .. వాళ్లు నిజంగా అలా ఫీల్ అవుతున్నారా ? లేక వాళ్లకి దగ్గర ఉండే PRO లు వాళ్లకి స్పూన్ ఫీడింగ్ ఇస్తున్నారా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు . హీరో నితిన్ విషయమే తీసుకోండి హిట్ సినిమా చూసి చాలా సంవత్సరాలవుతుంది .. ఎన్నో అంచనాలతో రాబిన్ హూడ్ సినిమా చేశాడు .. బాక్సాఫీస్ దగ్గర నిలబడాలంటే హిట్ అత్యవసరం .. అయినా కూడా మీడియాకి మొహం చూపించకుండా చాటేసి తన PRO ఇచ్చిన కంటెంట్ తో నమంత్రంగా నడిపించాడు .. అలాగే ఇక్కడ PRO లు ఆడుతున్న పెద్ద గేమ్ కూడా హాట్ టాపిక్ గా మారింది ..
వారి తో మంచి రిలేషన్ సంబంధాలు పెట్టుకున్న వాళ్లకు మాత్రమే స్పెషల్ రికమండేషన్ తో హీరోల ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారు అనే చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది .. అలాగే వారి తో అంట కాకుతూ వాళ్లకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే ఇలాంటి పనికిమాలిన ప్రక్రియ ఎలా చూడాలి ? అలాగే ఇలాంటి విషయాల పై నిర్ణయం సినిమాను నిర్మించే నిర్మాతల ది అంటూ హీరోల ది అంటూ వాళ్ళను కూడా బయటికి రాకుండా కట్టేస్తున్నారు .. ఇలా మొత్తంగా హీరోల పైత్యమా ? లేక PROల పైత్యమ అనే కన్ఫ్యూషన్ మాత్రం ఇండస్ట్రీలో కొనసాగుతుంది . ఇక మరి టాలీవుడ్ లో ఈ పరిస్థితి ఎప్పటికీ మారుతుందో చూడాలి .