- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


ఎస్ పై టైటిల్ నూటికి నూరు శాతం నిజం .. ఇది నిజ‌మే .. ఆ టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్‌ను చూస్తే నిజంగానే జాలేస్తోంది. ఎవ‌రా ?  డైరెక్ట‌ర్ ఎందుకు జాలేస్తోంద‌నుకుంటున్నారా ? ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు టాలీవుడ్ లో క్రేజీ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న హ‌రీష్ శంక‌ర్‌. హ‌రీష్ కు అంత‌కు ముందు సంగ‌తేమో గాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చేసిన గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా త‌ర్వాత తిరుగులేని క్రేజ్ వ‌చ్చేసింది. ఈ సినిమా తో హ‌రీస్ క్రేజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఆ సినిమా త‌ర్వాత ప‌దేళ్ల కు మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తోనే ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా ను తెర‌కెక్కించే ఛాన్స్ వ‌చ్చింది. అది కూడా నాలుగేళ్ల క్రింద‌ట .. ఈ అవ‌కాశం రాగానే హ‌రీష్ ఎగిరి గంతేశాడు.


ఆ ఛాన్స్ వ‌చ్చినా ఇప్ప‌ట‌కీ ఆ సినిమా ప‌ట్టాలు ఎక్క‌లేదు. మ‌ధ్య‌లో ప‌వ‌న్ మ‌రో మూడు సినిమాలు చేశాడు.. అవి రిలీజ్ కూడా అయ్యాయి. ఇక ప‌వ‌న్ ప్ర‌స్తుతం వీర‌మ‌ల్లు చేసేశాడు.. ఓజీ కూడా చాలా వ‌ర‌కు షూటింగ్ పూర్త‌య్యింది. అయినా ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ఇప్ప‌ట‌కీ సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు.. అస‌లు ఎప్పుడు వెళుతుందో ?  కూడా తెలియ‌ట్లేదు. తీవ్ర అస‌హ‌నంతో త‌న బాధ ఎవ్వ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క మ‌ధ్య‌లో ర‌వితేజ తో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ కూడా పూర్తి చేసేశాడు హ‌రీష్ .. ఆ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఇక ఇప్పుడు సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ తో  మ‌రో సినిమా చేసేందుకు హ‌రీష్ రెడీ అవుతున్నాడు.


రీసెంట్ గా స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రీసెంట్‌గా ‘ సంక్రాంతికి వస్తున్నాం ’ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు టాక్ ?  వెంకీ ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ చెప్పిన కథలు విని ఫైన‌ల్ గా హ‌రీష్ శంక‌ర్ కు ఓకే చెప్పాడ‌ట‌. ఈ సినిమా వెంకీ కెరీర్‌లో 77వ చిత్రంగా రాబోతుంది. మ‌రి హ‌రీష్ కు ఈ సినిమా తో అయినా హిట్ వ‌స్తుందేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: