తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు పూరి జగన్నాథ్ .. పవన్ కళ్యాణ్ బద్రి సినిమా తో చిత్ర‌ పరిశ్రమలో దర్శకుడుగా అడుగుపెట్టాడు పూరి .. 2006 లో మహేష్ బాబుతో చేసిన పోకిరి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనాల సృష్టించారు .. ఇలా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి హీరో ఇజం అంటే సరికొత్త అర్థం చూపించారు .. అలానే పూరి సినిమాలకు యూత్లో మంచి క్రేజ్ ఉంది .. పూరి సినిమాల కోసం అభిమానులు , ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు .  అలాంటి ఈ అగ్ర దర్శకుడు సినిమాలో అవకాశమస్తే నటించాలని ఎంతోమంది నటీనటుల ఆశ .  కానీ ఓ హీరోయిన్ మాత్రం పూరి జగన్నాథ్ సినిమా నుంచి వచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట ..
 

మోడలింగ్ చేస్తున్న సమయంలో బ్యూటీకి ఇండస్ట్రీ గురించి అంతగా ఏమీ తెలియదు .. అప్పుడే పూరి జగన్నాథ్ సినిమాలో అవకాశం వచ్చింది కానీ ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఈమె ఒప్పుకోలేదని చెప్పింది .  ఇంతకీ ఈ హీరోయిన్ మరెవరో కాదు .. స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ . తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఈమె స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి భారీ విజయాలు అందుకుంది .  అయితే పెళ్లి తర్వాత సైతం రకుల్ సినిమాలు చేస్తుంది .  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన కెరియర్ ఆరంభం పెళ్లి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంది .  కాలేజీలో చదువుకున్న రోజుల్లోనే మోడలింగ్ చేశానని ఆ సమయంలో తన ఫొటోస్ చూసి కన్నడ‌ సినిమా నుంచి ఆఫర్ వచ్చిందని ..


అయితే అప్పట్లో ఇండస్ట్రీ గురించి ఎంతగా నాకు తెలియదని కూడా చెప్పుకొచ్చింది .. ఆ సమయంలో ఆ సినిమా వాళ్ళు తన తండ్రి కి ఫోన్ చేసి మాట్లాడటంతో గిల్లి సినిమాలో నటించాని సినిమా షూటింగ్ వల్ల చదువుల్లో సమస్యలు వచ్చాయని మొదటి సినిమాతోనే నటనకు మంచి గుర్తింపు వచ్చింది అని కూడా చెప్పుకొచ్చింది . అలాగే ఆ తర్వాత తనకు పూరి జగన్నాథ్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని కానీ 70 రోజులు షూటింగ్ డేట్ అడిగారని అందుకు తాను ఒప్పుకోలేదు అని కూడా చెప్పింది .. కాలేజీ ఉందని కావాలంటే నాలుగు రోజులు ఇస్తానని కూడా చెప్పిందట .. సినిమాలు ఎన్ని రోజులు వర్క్ ఉంటుందనేది తనకు అప్పట్లో తెలియదని .. పూరి తన ఇబ్బందులు అర్థం చేసుకున్నారని కూడా తెలిపింది ఇక స‌మ‌యంలో ఎన్నో ఆఫర్స్ తెలియకుండానే వదులుకున్నట్లు రకుల్ చెప్పుకొచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: