గత కొన్ని రోజుల నుంచి మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య ఎన్నో రకాల గొడవలు జరుగుతున్నట్లు అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఏవో గొడవలు జరిగాయని, ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదని, పెద్ద ఎత్తున గొడవలు జరిగినట్లుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అయినప్పటికీ అందులో ఎలాంటి వాస్తవం లేదని గతంలో ఈ రెండు కుటుంబాల వారు స్పందించారు. అంతేకాకుండా మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. గురువారం రోజున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు జరిగింది.



దీంతో రామ్ చరణ్ కు చాలా మంది సెలబ్రిటీలు బర్త్డే విషెస్ తెలియజేశారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, పవన్ కళ్యాణ్, నాగబాబు, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి ఎంతోమంది హీరోలు రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే అల్లు అర్జున్ మాత్రం రామ్ చరణ్ కు పుట్టినరోజు విషెస్ చెప్పలేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను రామ్ చరణ్ అన్ ఫాలో చేశారు. ఆ కారణం చేతనే రామ్ చరణ్ పుట్టినరోజుపై అల్లు అర్జున్ స్పందించలేదని తెలుస్తోంది.


సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను రామ్ చరణ్ అన్ ఫాలో చేయడంతో ఈ రెండు కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు ఉన్నట్లుగా మరోసారి స్పష్టంగా తెలుస్తోంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఇదివరకే అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అన్ ఫాలో చేయడంతో ఈ రెండు కుటుంబాల మధ్య మరింత దూరం పెరిగినట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన మాత్రం అల్లు అర్జున్ ను ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నారు.

 అయితే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నట్లుగా ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ ఏదో సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్పడం మర్చిపోయాడేమో అంటూ కొంతమంది అంటున్నారు. ఇక రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ ఎందుకు చెప్పలేదనే కారణపై రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి. ఈ కామెంట్లపై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: