టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిన్నది తెలుగులో ఏమాయ చేసావే సినిమాతో తెలుగు సినీ  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సమంత వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటు కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ఇక ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.


రీసెంట్ గా ఈ చిన్నది నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి ఈ చిన్నది అద్భుతంగా నటించింది. ప్రస్తుతం సమంత తెలుగు, హిందీ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇక సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడమే కాకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.


అంతేకాకుండా సమంతకు మూగజీవులు అంటే ఎంతగానో ఇష్టం. ప్రతిసారి సమంత మూగజీవులపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే సమంత బయటి దేశంలో పార్కుకి వెళ్లారు. అక్కడ సమంత రెండు మూగజీవులను చూస్తూ అలానే ఉండిపోయింది. ఆ మూగజీవులతో దూరంగా కూర్చొని ఫోటో తీసుకుంది. అంతే కాకుండా మూగజీవులకు ఆహారాన్ని కూడా పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.


దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవడంతో సమంత అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సమంతకు మూగజీవులు అంటే ఎంతగానో ఇష్టమని మెచ్చుకుంటున్నారు. సమంతకి చాలా గొప్ప మనసు మూగజీవులని ఎంతగానో ప్రేమిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: