యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పోవే పోరా షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విష్ణు ప్రియ మొదటి షో తోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ షోలో తనదైన స్టైల్, యాంకరింగ్ తో మంచి గుర్తింపు అందుకుంది. అనంతరం వివిధ షోలలో యాంకర్ గా తన కెరీర్ సాఫీగా కొనసాగించింది. ప్రస్తుతం విష్ణు ప్రియ వివిధ ప్రోగ్రామ్ లలో  పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక విష్ణు ప్రియ షోల ద్వారా భారీగా డబ్బులను సంపాదిస్తుంది. అంతేకాకుండా విష్ణు ప్రియకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.


యూట్యూబ్ ద్వారా విష్ణు ప్రియ భారీగా డబ్బులను సంపాదిస్తుంది. విష్ణు ప్రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. విష్ణు ప్రియ సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతుంది. ఇదిలా ఉండగా... ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు, యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చాలామంది సెలబ్రిటీలపై కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. కొంతమందిని పోలీసులు అరెస్టు కూడా చేశారు.

ఇక మరికొంతమందిని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు విష్ణు ప్రియపైన కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే విష్ణు ప్రియ తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ కొట్టి వేయడానికి దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు విష్ణుప్రియకు నిరాకరించింది. అంతేకాకుండా పోలీసుల దర్యాప్తుకు సహకరించాలంటూ పోలీసులు విష్ణు ప్రియకు ఆదేశాలు జారీ చేశారు. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం చేసినందుకుగాను మియాపూర్ పోలీస్ స్టేషన్ లో విష్ణు ప్రియతో సహా పలువురు సెలబ్రిటీలపై, ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: