
ఇకపోతే సురేఖా తెలుగు సినీ నటి. ఈమె తెలుగుతో పాటుగా తమిళ సినిమాలలో కూడా నటించింది. దాదాపు 45 పైగా సినిమాలలో ఈమె సహాయ పాత్రలలో నటించింది. ఇలా సురేఖా కూతురు సుప్రీతా కూడా తన అందం, ప్రతిభతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
సుప్రీతాకి చాలా పాపులారిటీ ఉంది. ఈమె పోస్ట్ పెట్టిందంటే చాలు లక్షల్లో లైకులు, వేయిలలో కామెంట్స్ ఉంటాయి. ఈమె షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె అనే కుక్కింగ్ షోలో పాల్గొంటుంది. ఈ షో ఆహా ఓటీటీలో వస్తుంది. ఇక ఈ బ్యూటీ ఒక టాక్ షో కూడా స్టార్ట్ చేసింది. ఇటు సినిమాలు.. అటు కుక్కింగ్ షోనే అనుకుంటే, ఇప్పుడు టాక్ షో కూడా మొదలు పెట్టి ఫుల్ బీజీ బీజీ అయిపోయింది.
ఇక తాజాగా సుప్రీతా నాయుడు ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యింది. ఆ షోలో హోస్ట్ గా రీతూ చౌదరి ఉంది. అయితే ఆ ఇంటర్వ్యూలో రీతూ చౌదరి మాట్లాడుతూ.. 'యూట్యూబ్ స్టార్ట్ చేశావు. బ్రాండింగ్ చేస్తున్నావు. ప్రమోషన్స్ చేస్తావు. ఇన్ స్టాగ్రామ్ లో కూడా చాలా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తావు. అసలు నార్మల్ గా ఎంత సంపాదిస్తావు' అని అడిగింది. దానికి సుప్రీతా 'నేను నిజంగా చెప్తున్న నాకు ఆ కౌంట్ లేదు. ఏదైనా బల్క్ ఎమౌంట్ వస్తే చాలు ట్రిప్స్ కి వెళ్తాను. అది కూడా అమ్మని తీసుకొనే వెళ్తాను' అని చెప్పుకొచ్చింది. ఇక ఇది విన్న నెటిజన్స్ సోషల్ మీడియాతోనే సుప్రీతా ఇంత సంపాదిస్తుందా అని షాక్ అవుతున్నారు.