సిని ఇండస్ట్రీలో సైతం చిన్న చిన్న పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోయిన్గా మంచి అవకాశాలు అందుకున్న వారు చాలామందే ఉన్నారు. అందం, అభినయంతో ఎంతోమంది హీరోయిన్స్ ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తమ అందచందాలతో దర్శకుల దృష్టిని ఆకర్షించే పనిలో పడుతూ ఉంటారు. అలా ఇప్పుడు ఒక హీరోయిన్ ప్రత్యేకమైన టాటూ తో మరొకసారి వార్తలలో నిలుస్తూ ఉన్నది. హీరోయిన్స్ తో సమానంగా ఈ ముద్దుగుమ్మ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.


సోషల్ మీడియా పుణ్యమా అంటూ క్రేజీ సంపాదించుకున్నటువంటి వారిలో దివి కూడా ఒకరు.. మొదట పలు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిచ్చిన ఈమె ఆ తర్వాత బిగ్బాస్ లో ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజీ సంపాదించుకొని పలు సినిమాలలో ఆఫర్లను అందుకుంది. అలా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించిన ఈ అమ్మడు బిగ్ బాస్ లో తన అందంతో నటనతో ఆకట్టుకొని బయటికి వచ్చి పలు చిత్రాలలో నటించింది. జిన్నా, గాడ్ ఫాదర్, రుద్రాంగి, సింబ, డాకు మహారాజ్, పుష్ప-2 తదితర చిత్రాలలో నటించడమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటించింది.


సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే దివి క్రేజీ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ జిమ్ములో కష్టపడుతూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఇందులో ఈ అమ్మడు టాటూ అందరినీ ఆకర్షించేలా కనిపిస్తోంది. తన ఎద అందాల పైన ఉండే టాటూ చూసి కుర్రకారులు దివి అందాలతో పాటు తన మత్తు కళ్ళతో అందాలను వలకబోస్తూ ఫోటోలతో అరాచకం చేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తన టాటూ తో మరొకసారి సోషల్ మీడియాలో ఈమె పేరు వినిపించేలా చేసింది దివి.

మరింత సమాచారం తెలుసుకోండి: