టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు  పరిచయమైన సమంత ఆ సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్యతో నటిస్తున్న సమయంలోనే సమంత, చైతు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది.


అనంతరం కొన్ని సంవత్సరాల పాటు చాలా సీక్రెట్ గా వారి రిలేషన్ కొనసాగించిన ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహ అనంతరం సమంత, నాగచైతన్య వారి వైవాహిక జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా కొనసాగించారు. కేవలం నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే కలిసి ఉన్న ఈ జంట అతి తక్కువ సమయంలోనే మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం చైతు రీసెంట్ గా శోభిత ధూళిపాలను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.


ఇక సమంత మాత్రం ఇప్పటికీ సింగిల్ గానే తన లైఫ్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం సమంత వరుసగా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. తన నటనకు గాను సమంత ఎన్నో అవార్డులను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది.

సమంత తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకునే సమయంలో నాగచైతన్య కుటుంబ సభ్యులు సమంతకు 200 కోట్ల రూపాయలను భరణం కింద ఆఫర్ చేశారట. కానీ సమంత ఆ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేసిందట. తనకు ఎలాంటి భరణం అక్కర్లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయిందట. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: