ఐపీఎల్ మొదలయ్యింది అంటే చాలు ఎక్కువగా వినిపించే పేరు కావ్య మారన్. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ గా పేరు సంపాదించింది.. హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్కు కూడా హాజరవుతూ తన టీమ్ ఉత్సాహపరుస్తూ ఉంటుంది. ఈమె ఈ క్రమంలోనే ఎక్కువగా ఈమె పేరు వినిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కావ్య మారన్ చేసేటువంటి ఎక్స్ప్రెషన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక ఈ ఏడాది కూడా హైదరాబాద్ మ్యాచ్ సమయంలో ఈ అమ్మడు స్టేడియంలో తెగ సందడి చేస్తూ ఉంటుంది.


అయితే కావ్య మారన్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈమె సన్ గ్రూప్ యజమాని కళానిధి మారని కూతురుగా పేరు సంపాదించింది కావ్య మారన్. ఈమె ఆస్తి సుమారుగా 33 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. మా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు అనిరుద్ రవిచంద్రన్.. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లుగా కూడా కోలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ వార్తలపై అనిరుద్ టీమ్ కూడా స్పందిస్తూ ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని కావ్య, అనిరుద్ మంచి స్నేహితులని కూడా తెలియజేయడం జరిగింది. అయితే అనిరుద్ తో గతంలో కూడా హీరోయిన్ కీర్తి సురేష్ తో ప్రేమలో ఉన్నారని త్వరలో వీరు వివాహం చేసుకోబోతారనే విధంగా కూడా వార్తలు వినిపించాయి. కానీ అందరికీ షాక్ ఇస్తూ కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడైన అంటోనీని ప్రేమించి మరి వివాహం చేసుకున్నది.. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అనిరుద్ అటు సౌత్ ఇండస్ట్రీలో కూడా మ్యూజిక్ డైరెక్టర్గా బాగానే పేరు సంపాదించారు.. తెలుగు తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ పేరు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: