మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటేనే ఉంటారు. బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఈయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించేవారు. ఇక బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా సరే అంతా నా ఇష్టం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈయన చేసే కామెంట్లు మాట్లాడే మాటలు అన్నీ కూడా అందరికీ నవ్వు పుట్టిస్తాయి.రాజకీయాల్లో కొనసాగుతూనే మరోవైపు కళాశాలలను కూడా నడిపిస్తున్నారు. మల్లారెడ్డి కాలేజెస్ అన్ని ఈయనవే.. అలాగే పలు సినిమా ఈవెంట్లకు కూడా వెళ్తూ అక్కడికి వచ్చిన అభిమానులకి నవ్వులు పుట్టిస్తూ ఉంటారు. అయితే అలాంటి మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొని హీరోయిన్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి.మరి ఇంతకీ మల్లారెడ్డి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. 

ది గ్రేట్ లెజెండరీ దివంగత సింగర్ అయినటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం  కొడుకు ఎస్పీ చరణ్ చాలా రోజుల తర్వాత ఓ సినిమా చేస్తున్నారు. లైఫ్ అనే మూవీ తో మళ్లీ తెరమీద కనిపించబోతున్నారు. శ్రీహర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లైఫ్ మూవీ ఏప్రిల్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా గ్రాండ్ గా నిర్వహించారు.అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మాజీ మంత్రి మల్లారెడ్డి వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో మల్లారెడ్డి హీరో హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. హీరో శ్రీహర్ష మా కాలేజీ వాడే.మా కాలేజీలోనే చదువుకున్నాడు. అలాగే శ్రీహర్ష తండ్రి మా కాలేజీలో ప్రిన్సిపల్. అలా మా ప్రిన్సిపాల్ కొడుకు మా కాలేజీలో చదివిన అబ్బాయి హీరో అవ్వడం చాలా గర్వకారణం.

అలాగే శ్రీహర్ష తమిళ స్టార్ హీరో విజయ్ కంటే స్మార్ట్ గా ఉన్నాడు అంటూ హీరోని పొగిడారు.అలాగే ఇందులో హీరోయిన్గా నటించిన కషిక కపూర్ ని ఉద్దేశించి మల్లారెడ్డి మాట్లాడుతూ.. హీరోయిన్ పేరు కసి కపూర్ అంట.. చాలా కసి కసిగా ఉంది అంటూ మల్లారెడ్డి మాట్లాడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వే సారు. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ ఇక్కడికి వచ్చాను అంటూ మల్లారెడ్డి చెప్పకు వచ్చారు.అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ హీరోయిన్ పేరు కషికా కపూర్ అయినప్పటికీ కసి కపూర్ అని పిలిచి కసికసిగా ఉంది అని మల్లారెడ్డి మాట్లాడడం చాలామందికి నచ్చడం లేదు.దాంతో మల్లారెడ్డి మాటలు వివాదాస్పదంగా మారాయి. ఈయన మాటలు విన్న కొంత మంది నెటిజెన్లు ఒక బాధ్యత గల పదవిలో ఉన్న మీరు ఆడవాళ్ళ పై ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా అవమానకరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: