టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో , కీలక పాత్రలలో నటించాడు. అలా కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు అనే మూవీ లో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయనకు హీరోగా అవకాశాలు రావడం మొదలు అయింది.

అందులో భాగంగా ఈయన హీరోగా రూపొందిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.  విజయ్ దేవరకొండ , రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి ఇప్పటికే కమిట్ అయ్యాడు. ఈ మూవీ.కి రౌడీ జనార్ధన్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో రవి కిరణ్ కోలా , విజయ్ దేవరకొండకు హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో విజయ్ దేవరకొండకు జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

కీర్తి సురేష్ కెరియర్ ప్రారంభంలో నటించిన ఎన్నో సినిమాల్లో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ బ్యూటీ కూడా సినిమాల్లో అదిరిపోయే రేంజ్ అందాలను అరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు హిట్ పెంచుతుంది. ఇకపోతే ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు , తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd