తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో రెజీనా ఒకరు. ఈమె "SMS" శివ మనుసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా రెజీనా కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమెకు మంచి అవకాశాలు రావడం జరిగింది. దానితో ఈమె తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఈమె నటించిన సినిమాలు ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ రావడంతో క్రమ క్రమంగా ఈమె క్రేజ్ తగ్గిపోతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ స్టార్ హీరోల సినిమాలలో , మీడియం రేంజ్ హీరోల సినిమాలలో హీరోయిన్ అవకాశాలను దక్కించుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయింది. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ఈమె కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఓ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.

అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం శేఖర్ కమ్ముల "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శేఖర్ కమ్ముల , రెజీనాను ఒక పాత్రకు అనుకున్నాడట. అందులో భాగంగా ఆమెను సంప్రదించో విషయం చెప్పగా ఆమె మాత్రం ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇకపోతే ప్రస్తుతం శేఖర్ కమ్ముల , ధనుష్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా రూపొందుతున్న కుబేర మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: