సమంత ఎప్పుడు ఏదో ఒక విషయంతో వివాదాన్ని సృష్టిస్తూనే ఉంటుంది.అయితే పరోక్ష కామెంట్లు చేస్తూ అప్పుడప్పుడు తనపై దుష్ప్రచారం చేసే వారికి గట్టి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. అయితే అలాంటి సమంత తాజాగా తన మాజీ భర్త నాగచైతన్య పై పరోక్ష కామెంట్లు చేసింది. సమంత చేసిన ఈ కామెంట్లు మాజీ భర్త నాగచైతన్య పై కౌంటర్లు వేసినట్టుగా ఉన్నాయి.మరి ఇంతకీ సమంత మాట్లాడిన ఆ మాటలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సమంత తాజాగా సిడ్నీలో జరిగిన ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ సిడ్ని ఈవెంట్ లో పాల్గొంది. అయితే ఆ ఈవెంట్లో సక్సెస్ గురించి మాట్లాడుతూ.. సక్సెస్ అంటే మనం అనుకున్నది సాధించడం మాత్రమే కాదు. 

స్వేచ్ఛగా జీవించడం, సామాజిక పట్టింపుల నుండి విముక్తి పొందడం, కట్టుబాట్లు వంటి వాటి నుండి బయటపడడం.. ఇలాంటి వాటి నుండి బయట పడ్డప్పుడే అసలైన సక్సెస్ లభిస్తుంది. అలాగే జీవితంలో నాకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి.వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వచ్చాను అంటూ సమంత చెప్పుకొచ్చింది. అయితే సమంత సక్సెస్ గురించి మాట్లాడిన దాంట్లో పట్టింపులు,కట్టుబాట్లు అంటూ మాట్లాడడం తన మాజీ భర్తను ఉద్దేశించే మాట్లాడింది అని,తన అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఇంట్లో ఉండాలి,

 అలాంటి సినిమాలు చేయొద్దు, ఇలాంటి సినిమాలు చేయొద్దు అని స్వేచ్ఛనివ్వకుండా చేయడం వల్లే సమంత అలా విడాకులు తీసుకుందని ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే తన మాజీ భర్త తనకి స్వేచ్ఛనివ్వకుండా తన సక్సెస్ కి అడ్డుపడ్డాడు అని పరోక్షంగా ఆ ఈవెంట్లో సమంత ఈ వ్యాఖ్యలు చేసినట్టు చాలామంది నెటిజన్లు భావిస్తున్నారు.ఇక సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మండ్ అనే వెబ్ సిరీస్ తో పాటు మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది.అలాగే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోయే సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: