ప్రస్తుతం చాలా చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదలవు  బాక్సాఫీస్ వద్ద చిన్న పెద్దా అని తేడా లేకుండా సత్తా చాటుతూ ఉన్నాయి. స్టార్ హీరోయిన్స్ లేకుండానే చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అయితే ఒక సినిమా మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై థియేటర్లో గోరంగా ఫ్లాప్ ని మూట కట్టుకున్నది. అసలు పెట్టుబడి భారీగా పెట్టి కలెక్షన్స్ కి సంబంధం లేకుండా రాబట్టింది. దీంతో నిర్మాతలు కూడా భారీ షాక్ తగిలింది.


హీరో ఎవరో కాదు బాలీవుడ్ లో బడా నిర్మాత కొడుకు.. అర్జున్ కపూర్.. 45 కోట్ల రూపాయలతో ఒక సినిమాని తెరకెక్కించగా కేవలం 45 వేల రూపాయలు కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. దేశంలోనే అత్యంత చెత్త చిత్రంగా నిలిచింది.ఈ సినిమానే లేడీ కిల్లర్.. ఈ సినిమా ఇప్పటి వరకు పాన్ ఇండియా చరిత్రలోనే ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. 2023 నవంబర్ 3వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యింది. అయితే అప్పటికే అర్జున్ కపూర్ బాలీవుడ్ నటి మలైకా అరోరాతో డేటింగ్ లో ఉంటూ నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉండేవారు.


సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో లేడీ కిల్లర్ సినిమా విడుదల అవ్వగా ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇందులో హీరోయిన్గా భూమి ఫడ్నేకర్  నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ అజయ్ బహ్లు దర్శకత్వం వ్యవహరించారు యూట్యూబ్ లో ఈ సినిమా ప్రస్తుతం ఫ్రీగానే ఉన్నదట. థియేటర్లో విడుదలైన ఈ సినిమా మొత్తం 12 షోలు ఆడగా మొదటి రోజు 38వేల రూపాయలు ఇక సినిమా విడుదలై ప్రముఖ ఓటీటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్ తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఈ కలెక్షన్స్ చూసి ఆ డీల్ కూడా క్యాన్సిల్ చేసుకున్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి: