"పవన్ కళ్యాణ్".. ఈ పేరు పలుకుతూ ఉంటేనే ఒక తెలియని వైబ్రేషన్స్ . విన్న వాళ్ళకి మరొక వైబ్రేషన్స్.. ఆ పేరులోనే ఆ పవర్ ఉంది. ఇలా చాలామంది పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ పొగిడేస్తూ ఉంటారు.  పవన్ కళ్యాణ్ ని ఎంతమంది పొగుడుతూ ఉంటారో అంతమంది తిడుతూ ఉంటారు . అఫ్కోర్స్ సినిమాలపరంగా పవన్ కళ్యాణ్ కి నెగిటివిటీ అనేది లేదు . పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాతే ఆయన ఫ్రెండ్స్ ఆప్తులు కూడా శత్రువులుగా మారిపోయారు. అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ ఆ శత్రువులు మిత్రులుగా మారడానికి బాగానే ట్రై చేస్తున్నారు .


పవన్ కళ్యాణ్ తో అపాయింట్మెంట్ కోసం పవన్ కళ్యాణ్ తో మళ్ళీ జాన్ జిగిడి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేయడం కోసం నానాతంటాలు పడుతున్నారు . కాగా పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ ఓ పక్క సినిమాలతో మరొక పక్క రాజకీయాలతో బిజీ బిజీగా సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ముందుకు దూసుకెళ్తున్నారు . ఈ టైం లోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఎన్నో సినిమాల్లో నటించాడు . ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యమే. ఆఫ్ కోర్స్ కొన్ని ఫ్లాప్ కూడా అయ్యాయి.



అయితే పవన్ కళ్యాణ్ నటించిన ఒక సినిమా ఆయనకు పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా దక్కేలా చేసింది . ఆ మూవీ మరేంటో కాదు గుడుంబా శంకర్ . గుడుంబా శంకర్ సినిమా పవన్ కళ్యాణ్ కి ఎంత పాజిటివ్ కామెంట్స్ దక్కించిందో అంతే నెగిటివ్ కామెంట్స్ దక్కించింది. మరీ ముఖ్యంగా ఆయన లుక్స్ . గుడుంబా శంకర్ సినిమా హిట్ అవ్వడానికి కారణమయ్యాయి . పవన్ కళ్యాణ్ కెరియర్ ట్రోలింగ్ అవ్వడానికి కారణమైంది కూడా ఆ గుడుంబ శంకర్ లుక్సెస్.



ఈ సినిమాలో పాటలు ఆయన ఆటిట్యూడ్ డైలాగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఈ సినిమాని వీరశంకర బైరిశెట్టి తెరకెక్కించారు.  కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనపై ఆయన ఆటిట్యూడ్ పై ఆయన డైలాగ్స్ పై ఎంత పాజిటివ్ కామెంట్స్ వినిపించాయో అంతే నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి.  అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్యాంట్ మీద ప్యాంట్ వేయడం ఒక ట్రెండ్ . అలా ఇంట్లో ఎవరైనా వేస్తే చాలు తల్లిదండ్రులు పిచ్చెక్కిందా రా ..? అని తిట్టేవాళ్ళు అంతలా ఆయన పేరు ట్రోలింగ్కి కూడా గురైంది . సోషల్ మీడియాలో మరొకసారి అదే వార్తను గుర్తు చేసుకుంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: