
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనిషి. ముక్కుసూటి మనిషి అనే మాట్లాడాలి. ఏ విషయానైనా సరే స్ట్రైట్ ఫార్వడ్ గా చెప్పేస్తుంటారు. అలాంటి బాలయ్య ఒక సినిమా విషయంలో ఫీలయ్యాడా..? ఏంటి ఆ సినిమా..? అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. ఆ సినిమా మరేంటో కాదు "జగదేకవీరుడు అతిలోకసుందరి".. చిరంజీవి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ హిట్టుగా నిలిచిన ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే .
శ్రీదేవి - చిరంజీవిల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలెట్గా మారింది . ముఖ్యంగా పాటలు . అబ్బా ఏం రాశారు... ఇప్పటికీ ఈ పాటలు విన్నా సరే చెవులు హ్యాపీగా మనసు ఆహ్లాదకరంగా మారిపోతూ ఉంటుంది . అలాంటి సినిమా కధ ముందుగా చిరంజీవి వద్దకు కాకుండా బాలయ్య వద్దకు వచ్చిందట . ఆ మూమెంట్లో వేరే సినిమా షూట్ లో బిజీగా ఉండడం .. డైరెక్టర్ అసలు కాల్ షీట్స్ లేట్ చేయకూడదు అని చెప్పడంతో ఈ సినిమా ఛాన్స్ బాలయ్య వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా చిరంజీవి చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. చిరంజీవి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయి .. ఇప్పటికీ ఆయన కెరియర్ లో హిట్ మూవీల లిస్ట్ లో ఇది టాప్ స్థానంలో ఉంటుంది..!