
కొంతమంది ముందుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ లో దాగున్న హోస్ట్ ని కూడా బయటకు తీసుకొచ్చారు . ఆయన మీలో ఎవరు కోటీశ్వరుడు ..బిగ్ బాస్ సీజన్ లని హోస్ట్ చేశారు . అయితే చాలా టైం గ్యాప్ తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మారిపోతున్నారట .. అయితే ఈసారి మాత్రం ఓ రియాలిటీ గేమ్ షో కి కాకుండా ఓ టాక్ షో కి హోస్ట్ గా మారిపోతున్నారట . . ప్రముఖ ఓటీటీ సంస్థతో చేతులు కలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఓ టాక్ షో కి హోస్టుగా మారిపోతున్నారట . ..
అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆయన తెలుగులో టాక్ షో కి హోస్టుగా మారడం లేదు . బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ షోకి హోస్టుగా మారిపోతున్నారట . . ఇదంతా వార్ 2 సినిమా ప్రమోషన్స్ కోసమే చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు జనాలు . మొత్తానికి అభిమానుల కోరికను ఈ విధంగా తీర్చేయబోతున్నాడు. అయితే కొంతమంది మాత్రం టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్లో హోస్టుగా చేయడం ఏంటి..? ఇది తారక్ కెరియర్ కి నెగిటివ్ గా మారబోతుంది ఏమో అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు ...!