
మన తెలుగులో వచ్చిన మగధీర , మనం వంటి సినిమాల స్టోరీ లానే ఈ మూవీ కూడా ఉండబోతుందని అంటున్నారు .. ఇప్పటికే ఈ సినిమాను స్టోరీని ఫైనల్ చేశారని త్వరలోనే ఈ సినిమాని కూడా అఫీషియల్ గా ప్రకటిస్తారని కూడా టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తుంది .. త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి మరి అల్లు అర్జున్ , అట్లీ సినిమా ను ఓకే చేశాడు .. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావటం తో ఈ మూవీ పై పాన్ ఇండియా స్థాయి లో భారీ అంచనాలు ఉన్నాయి ..
ఇక అట్లీ కూడా షారుఖ్ ఖాన్ జవాన్ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా ను మొదలుపెట్టలేదు .. అల్లు అర్జున్ సినిమా కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిన అట్లీ ఈ సినిమా ను కూడా పాన్ ఇండియా స్థాయిలో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెర్కెక్కించ బోతున్నారని కూడా అంటున్నారు .. ఇప్పటి కే అట్లీ బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాల తో దూసుకుపోతున్నాడు .. ఇక మరి ఇప్పుడు అల్లు అర్జున్ తో చేసే సినిమా తో కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తారో చూడాలి .