హిందీ సినీ పరిశ్రమ లో స్టార్ హీరోలలో ఒకరి గా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సల్మాన్ ఖాన్ ఒకరు . ఈయన చాలా సంవత్సరాల క్రితం హీరోగా కెరియర్ను మొద లు పెట్టి ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని ప్రస్తుతం కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో విజయాలను అందుకున్న సల్మాన్ ఖాన్ కి ఈ మధ్య మాత్రం చెప్పుకోదగ్గ విజయాలు రాలేదు. ఆఖరుగా సల్మాన్ "టైగర్ 3" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇకపోతే సల్మాన్ తాజాగా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన సికిందర్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ రేపు అనగా మార్చి 30 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇకపోతే సల్మాన్ కోలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి అట్లీతో ఓ మూవీ చేయబోతున్నట్లు అనేక వార్తలు కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

తాజాగా సల్మాన్ , అట్లీ తో మూవీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా సల్మాన్ మాట్లాడుతూ ... అట్లీతో మూవీ చేయాలి అనుకున్న మాట వాస్తవం. కానీ ఆ సినిమాకు బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అనే నేపథ్యంలో ఆ మూవీ ని వదిలేసాను అని సల్మాన్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే అట్లీ తన తదుపరి మూవీ ని అల్లు అర్జున్తోల్ తో చేయబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొంత కాలం లోనే వెలవడ బోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: