సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అవుతుంటారు. అలా సక్సెస్ అయిన ముద్దుగుమ్మలలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన ఒకరు. ఈ బ్యూటీ కన్నడ మూవీ ల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ సినిమాల ద్వారా ఈమె ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది.

ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 2 అనే సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించాడు. పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీ తాజాగా విక్కీ కౌశల్ హీరో గా రూపొందిన ఛావా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కొంత కాలం క్రితం విడుదల అయ్యి 800 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ రెండు సినిమాల ద్వారా ఈ బ్యూటీ 2600 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన సికిందర్ అనే మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ రేపు అనగా మార్చి 30 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా కనుక ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్లయితే ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలో 3000 కోట్ల కలెక్షన్లను తన మూడు సినిమాలతో అందుకున్న నటిగా రికార్డు సృష్టిస్తుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: