టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత హీరో గా కెరియర్ను మొదలు పెట్టాడు. హీరోగా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత ఈయన అద్భుతమైన విజయాలను అందుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

ప్రస్తుతం నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న  ది ప్యారడైజ్ మూవీలలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే నాని కొన్ని సంవత్సరాల క్రితం పిల్ల జమిందార్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో హరి ప్రియ , బిందు మాధవి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో హరిప్రియ మెయిన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు ఆ తర్వాత తెలుగులో పరవాలేదు అనే స్థాయి క్రేజ్ ఉన్న కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కానీ ఆ మూవీలు పెద్దగా విజయాలను సాధించకపోవడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. దానితో ఈమె ఇతర భాష సినిమాల్లో కూడా నటించింది. కానీ అక్కడ కూడా ఈమె పెద్ద స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం ఈమె అడపా దడపా సినిమాల్లో నటిస్తూ కెరియర్ను బాగానే ముందుకు సాగిస్తుంది.

ఈమె సినిమాల సంఖ్య తగ్గిన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే పిల్ల జమిందార్ సినిమా వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ కూడా హరి ప్రియ అద్భుతమైన స్థాయిలో అందాలను మెయింటెన్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: