తాజాగా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ దాదాపు రెండు సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న మ్యాడ్ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. ఇక మ్యాడ్ మూవీ అద్భుతమైన విజయం సాధించకుండా మ్యాడ్ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన సినిమా కావడంతో మ్యాడ్ స్క్వేర్ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ నిన్న అనగా మార్చి 28 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్లు లభించినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులు ఇప్పటికే అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ వారు దక్కించుకున్నట్లు , అలాగే ఈ మూవీ ఓ టి టి హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన కొన్ని వారాల ధియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ కానున్నట్లు , ఆ తర్వాత కొన్ని వారాలకు ఈ మూవీ స్టార్ మా చానల్లో టెలికాస్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: