తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా , నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన తన కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని నటుడిగా తనకంటూ ఒక మంచి స్థానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏర్పరచుకున్నాడు. అలాగే ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని నిర్మాతగా కూడా తనను తాను చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ , అర్జున్ S/O వైజయంతి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఓ టీజర్ను విడుదల చేసింది. ఆ టీజర్ అద్భుతంగా ఉండడంతో ఒక్క సారిగా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానితో ఈ మూవీ యొక్క సాటిలైట్ , డిజిటల్ హక్కులకు కూడా భారీ క్రేజ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని నాయల్ది అంటూ సాగే ఫస్ట్ లిరికల్ వీడియోను మార్చి 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన ఈ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ అదిరిపోయే డ్యాన్స్ స్టెప్ వేస్తూ ఉన్నాడు.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది చాలా వరకు ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ లోని నాయల్ది అంటూ సాగే మొదటి పాట ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr