ఇండియన్ సినిమాల్లో కొంతమంది హీరోయిన్లు అలా వచ్చి ఇలా స్టార్లుగా మారుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో సీనియర్ నటి రంభ కూడా ఒకరు.ఈ ముద్దుగుమ్మ చిన్న సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి భారీ హిట్ కొట్టడమే కాదు నార్త్, సౌత్ రెండు ఇండస్ట్రీలలో సత్తా చాటింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కెనడా కి చెందిన బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ వదిలి కెనడాకి వెళ్ళిపోయింది. అలా చాలా రోజులు భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉన్న రంభ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్టు ఈ మధ్యకాలంలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు రంభ ఇండియాకి వచ్చి పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ మంచి కథ ఉంటే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని త్వరలోనే రీ ఎంట్రి ఇవ్వబోతున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చింది.

ఇక రంభ మాటలు చూసి ఎవరైనా దర్శక నిర్మాతలు మళ్లీ ఆమెను సినిమాల్లోకి తీసుకుంటారని ఆమె అభిమానులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే రంభ విడాకుల వార్తలు కూడా టాలీవుడ్ మీడియాని షేక్ చేస్తున్నాయి. సీనియర్ నటి రంభ తన భర్తతో విడాకులు తీసుకోబోతుందని,అందుకే భర్తతో గొడవలు పడి ఇండియాకు వచ్చేసిందనే రూమర్స్ ఆ మధ్యకాలంలో వినిపించాయి.అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవాలి అనుకున్న సమయంలో ఓ హీరో డైరెక్టర్ ఇద్దరు కలిసి వీరి మధ్య సయోధ్య కుదిర్చారని మళ్ళీ ఇద్దరినీ కలిపారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే విడాకుల వార్తలపై ఆ మధ్యకాలంలో  ఓ టీవీ షో లో జడ్జిగా పాల్గొన్న రంభ మాట్లాడుతూ..నాకు ఓసారి భర్తతో చిన్న గొడవ జరిగింది.అయితే ఆ చిన్న గొడవకే నేను పెద్ద రచ్చ రచ్చ చేసేసి నా బట్టలన్నీ బ్యాగ్ లో సర్దుకొని నా భర్తకు చెప్పకుండానే ఇంట్లో నుండి వచ్చేసాను.

 ఇక కెనడా నుండి చెన్నై ఫ్లైట్ ఎక్కేసి కెనడా నుండి చెన్నైకి వచ్చాను. ఫ్లైట్ ఎక్కే ముందే నా ఫ్యామిలీకి జరిగిన గొడవంతా చెప్పేసాను.  ఆ టైంలో మా ఫ్యామిలీ చాలా కంగారు పడింది.అలా కెనడా నుండి చెన్నైకి వచ్చి ఫ్యామిలీతో కలిసిపోయాను.ఆ తర్వాత మా మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి మళ్లీ నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోయాను. అయితే ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ లో ఇలాంటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. కానీ వాటిని విడాకులు తీసుకునేంత వరకు వెళ్లినివ్వకూడదు. మేం విడాకులు తీసుకోలేదు కలిసే ఉన్నాం అంటూ రంభ చెప్పుకొచ్చింది.. ఇక రంభ మాటలతో మరోసారి అందరికీ ఆమె విడాకులపై క్లారిటీ వచ్చినట్లు అయింది

మరింత సమాచారం తెలుసుకోండి: