ఇండియా టుడే లో ప్రభావితమైనటువంటి నాయకులు ఎవరెవరు ఉన్నారు దేశంలో అన్నది టాప్ -100 లిస్టు తీయగా అందులో కొంతమంది పేర్లు ఉన్నాయి.. అలాగే  సినిమా యాక్టర్స్ విషయానికి వస్తే..టాలీవుడ్ హీరోలలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా వీళ్ళు ఎవరు కాకుండా ఈ ఏడాది ప్రభావితమైనటువంటి సినీ నటుడు ఎవరనే విషయాన్ని తెలియజేశారు. అందులో అల్లు అర్జున్ ఒక్కడే స్థానం సంపాదించుకున్నారు. ఇది తాజాగా అల్లు అర్జున్ అభిమానులకు ఊపునిచ్చే అంశంగా మారిపోయింది. దక్షిణాది లెక్కన చూసుకుంటే హీరో దళపతి విజయ్ కూడా ఉన్నారు. కానీ ఇది కేవలం తమిళనాడుకు సంబంధించి మాత్రమే ఉన్నదట.


తెలుగు వాళ్లలో మాత్రం అల్లు అర్జున్ ఒక్కడే ఇండియాటుడే కి బెటర్ ర్యాంకుగా కనిపించారు. పాన్ ఇండియా స్టార్లు గా పేరుపొందినటువంటి అమితాబ్, ఆలియా భట్, కరణ్ జోహార్, షారుక్ ఖాన్ , నేషనల్ క్రష్ గా పేరుపొందిన రష్మికకు కూడా ఈ అవకాశం రాలేదు.. కేవలం ఒక అల్లు అర్జున్ ని మాత్రమే ఈ ఏడాది ప్రభావితవంతమైన నటుడిగా క్యారెక్టర్ కిందన ఎంపిక చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే.. ఇతర హీరోలు పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డమ్  ఉన్నప్పటికీ ఇందులో చోటు సంపాదించుకోలేకపోయినట్లు కనిపిస్తోంది.


గత ఏడాది పుష్ప 2 చిత్రంతో సరికొత్త మ్యానురిజాన్ని చూపించిన అల్లు అర్జున్.. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల అల్లు అర్జున్ పేరు మరింత మారుమోగిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా 1800 కోట్లకు పైగా రాబట్టి సరికొత్త రికార్డులను కూడా తిరగరాశారు అల్లు అర్జున్. అందుకే ఈ ఏడాది ప్రభావితవంతమైన నటులలో స్థానాన్ని సంపాదించుకున్నట్లు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ఇక తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ లేకపోతే త్రివిక్రమ్ తో చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: