మార్చ్ 27 మరియు 28 తేదీలలో తెలుగు బాక్సా ఫీస్ దగ్గర నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో రెండు స్టేట్ తెలుగు మూవీ లు కాగా , ఒక తమిళ డబ్బింగ్ సినిమా మరో మలయాళ డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ నాలుగు సినిమాలు ఏవి ..? వాటికి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.

మార్చి 27 వ తేదీన మలయాళ నటుడు మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఎంపురాన్ అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా లూసిఫర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా L3 ది బిగినింగ్ అనే మూవీ ని కూడా రూపొందించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే మార్చ్ 27 వ తేదీన తమిళ నటుడు చియన్ విక్రమ్ హీరోగా రూపొందిన వీర దీర శూర పార్ట్ 2 అనే సినిమా విడుదల అయింది. ఇకపోతే వీర ధీర శూర పార్ట్ 1 మూవీ ని రూపొందించనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే మార్చ్ 28 వ తేదీన మ్యాడ్ స్క్వేర్ మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ దాదాపు రెండు సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న మ్యాడ్ స్క్వేర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది.

ఇక మ్యాడ్ స్క్వేర్ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ క్యూబ్ మూవీ ని కూడా రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 28 వ తేదీన నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందిన రాబిన్ హుడ్ అనే సినిమా విడుదల అయింది. ఈ సినిమాకు కొనసాగింపుగా బ్రదర్ హుడ్ రాబిన్ హుడ్ అనే సినిమా రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇలా మార్చి 27 , 28 తేదీలలో విడుదల అయిన ఈ నాలుగు సినిమాలకు కొనసాగింపు మూవీలు రాబోతున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల మధ్య ఉన్న కామన్ పాయింట్ ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి: